సాహో సెట్స్ పైకి వచ్చిన ప్రభాస్

Friday,August 18,2017 - 12:22 by Z_CLU

రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సెట్స్  పైకి  వచ్చేశాడు. హైదరాబాద్ లోని  రామోజీ  ఫిల్మ్ సిటీలో   దాదాపు 5 కోట్ల వ్యయంతో నిర్మించిన సెట్ లో ఈ రోజే యాక్షన్ మోడ్ లోకి వచ్చేశాడు ప్రభాస్.

సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేసుకుంది సినిమా యూనిట్. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ సరసన జోడీ కట్టనున్న శ్రద్ధా కపూర్ సెప్టెంబర్ నుండి షూటింగ్ లో పాల్గొననుంది. పాప్యులర్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ‘కెన్నీ బేట్స్’ ఈ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.