90 కోట్ల ఖరీదైన షెడ్యూల్ పూర్తి

Tuesday,May 22,2018 - 01:07 by Z_CLU

52 రోజుల షూటింగ్.. 90 కోట్ల రూపాయల ఖర్చు
సాహోకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ ఖర్చు ఇది
సినిమాకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అబుదాటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. మార్చి 31న ప్రారంభమైన ఈ షెడ్యూల్ నిన్నటితో ముగిసింది. కేవలం సినిమాలో యాక్షన్ పార్ట్ కోసమే ఇంత టైమ్, ఇంత డబ్బు కేటాయించారు మేకర్స్.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో అబుదాబిలో భారీ యాక్షన్ సీన్లు పిక్చరైజ్ చేశారు. 250 మంది యూనిట్ తో ఈ షెడ్యూల్ పూర్తిచేశారు. సాహోలో హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నాయి ఈ ఫైట్స్.  ఈ షెడ్యూల్ తో సినిమాకు సంబంధించి దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది.

అబుదాబి షెడ్యూల్ లో యాక్షన్ బ్లాక్ కోసం ఏకంగా 28 కార్లు, 5 ట్రక్కులు పేల్చేశారు. 5 మోషన్ కెమెరాలతో పాటు అత్యాధునిక డ్రోన్ కెమెరాలు కూడా వాడారు. సినిమాలో ఈ ఫైట్లు, ఛేజింగ్ సీన్లు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయంటున్నాడు ప్రభాస్. 200 కోట్ల బడ్జెట్ లో 90 కోట్లు కేవలం ఈ షెడ్యూల్ కే కేటాయించారు.

మూవీకి సంబంధించి త్వరలోనే మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే నెక్ట్స్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో పెట్టాలా.. లేక రొమేనియాకు వెళ్లాలా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకుడు.