సాహో వచ్చేది సంక్రాంతికే..?

Saturday,February 03,2018 - 03:18 by Z_CLU

ప్రభాస్ సినిమాపై ప్రస్తుతం వినిపిస్తున్న హాట్ గాసిప్ ఇది. సెట్స్ పై ఉన్న ఈ సినిమా లెక్కప్రకారం ఈ ఏడాదిలోనే విడుదలకావాలి. సమ్మర్ కు ఎలాగూ రాదు. కనీసం దసరా లేదా దీపావళికైనా వస్తుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ వాళ్లందరికీ బ్యాడ్ న్యూస్.

సాహో సినిమా రిలీజ్ వచ్చే ఏడాదికి వాయిదాపడినట్టు తెలుస్తోంది. 2019 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయాలని అనుకుంటున్నారట. షెడ్యూల్స్ ఆలస్యం కావడమే దీనికి కారణమని తెలుస్తోంది.

సాహో సినిమాకు సంబంధించి కీలకమైన దుబాయ్ షెడ్యూల్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈనెలాఖరుకు అది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రొమేనియాలో మరో భారీ షెడ్యూల్ ఉంది. వీటితో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా టైం కావాలి. అందుకే సినిమా వాయిదా పడినట్టు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ హీరోయిన్.