సాహో మాడరన్ సినిమా కాదు

Monday,July 31,2017 - 03:09 by Z_CLU

బాహుబలి లాంటి బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ తరవాత సాహో సినిమాతో మళ్ళీ అదే రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ప్రభాస్. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫాస్ట్ పేజ్ లో జరుగుతున్నాయి. అయితే తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా, అందరు అనుకున్నట్టుగా జస్ట్ మాడరన్ సినిమా కాదట. ఈ విషయం స్వయంగా ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ సూపర్ స్టైలిష్ గా ప్లాన్ చేస్తున్నారట ఫిల్మ్ మేకర్స్. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో స్తైలిష్  స్టంట్స్ ఉండబోతున్నాయి. హాలీవుడ్  పాప్యులర్ స్టంట్ మ్యాన్ ‘కెన్నీబేట్స్’ ఈ సినిమా కోసం పని చేయబోతున్నాడు.

సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. మ్యాగ్జిమం ఆగష్టులో సెట్స్ పైకి రాబోయే ఈ సినిమాకి హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదు.