మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ లో సాహో

Saturday,October 27,2018 - 02:26 by Z_CLU

హాలీవుడ్ లో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ వెరీ వెరీ స్పెషల్. ఈ సినిమాలన్నీ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరో క్యారెక్టర్, మోస్ట్ ఎనర్జిటిక్ గా సూపర్ పవర్స్ తో ఉంటుంది. సరిగ్గా సాహోలో ప్రభాస్ పాత్ర కూడా అలానే ఉంటుంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, సాహోలో గూఢచారిగా కనిపించబోతున్నాడట ప్రభాస్. తనకు అప్పగించిన మిషన్ లో భాగంగా కుట్రను చేధించేందుకు వివిధ దేశాల్లో తిరుగుతుంటాడట. అతడికి హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఫుల్ సపోర్ట్ అందిస్తుందట. ప్రస్తుతానికైతే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పై నడుస్తున్న గాసిప్ ఇదే.

టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సాహోను ఒకేసారి విడుదల చేయబోతున్నారు.