సాహో రన్ టైమ్ కాస్త ఎక్కువే!

Wednesday,August 14,2019 - 12:20 by Z_CLU

సినిమా రన్ టైమ్ రెండున్నర గంటలు దాటితే ప్రేక్షకుడికి బోర్ కొడుతుందనే భ్రమలు ఎప్పుడో తొలిగిపోయాయి. అర్జున్ రెడ్డి సినిమా అలాంటి భ్రమల్ని పటాపంచలు చేసింది. ఆ తర్వాత రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి లాంటి ఎన్నో సినిమాలు కాస్త లాంగ్ రన్ టైమ్ లో థియేటర్లలోకి వచ్చాయి. బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి. ఇప్పుడు సాహో కూడా అదే దారిలో నడుస్తోంది.

సాహో ఎడిటింగ్ పూర్తయింది. రన్ టైమ్ 2 గంటల 52 నిమిషాలు ఉంది. ఇదే రన్ టైమ్ ను ఉంచుతారా, ట్రిమ్ చేస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. సినిమాలో దాదాపు గంటన్నర నిడివి యాక్షన్ ఎపిసోడ్స్ తోనే సరిపోయింది. పాటలకు మరో 15 నిమిషాలు కేటాయించారు. మిగతా రన్ టైమ్ లో స్క్రీన్ ప్లే నడుస్తుంది.

దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది సాహో సినిమా. ప్రభాస్, శ్రద్ధకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఇంకా ట్రిమ్ చేయడానికి నిర్మాతలు, దర్శకులు ఇష్టపడడం లేదు. ఈ సినిమా ఒరిజినల్ రన్ టైమ్ ఎంతో తెలియాలంటే మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వాలి. మరో 2 రోజుల్లో ఆ ఫార్మాలిటీస్ పూర్తికాబోతున్నాయి.

మరోవైపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా డేట్ లాక్ అయింది. ఈనెల 18న రామోజీ ఫిలింసిటీలో సాయంత్రం 5 గంటల నుంచి సాహో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది.