సాహో ‘బ్యాడ్ బాయ్’ కూడా అంతే!

Tuesday,August 20,2019 - 10:02 by Z_CLU

ప్రభాస్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కి ఓ ప్రత్యేకత ఉంటుంది. రెగ్యులర్ గా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసమే అన్నట్టు అస్సలుండవు. అందుకే రీసెంట్ గా రిలీజ్ అయిన సాహో ‘బ్యాడ్ బాయ్’ సాంగ్ పై కూడా ఫ్యాన్స్ లో అలాంటి అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టెప్పులేసిన ఈ పాట ప్రభాస్ ని మోస్ట్ స్టైలిష్ బ్యాడ్ బాయ్ గా ప్రెజెంట్ చేస్తుంది. అయితే ఈ సాంగ్ వెనక సినిమాలో ఇంకేదో హై పాయింట్ కచ్చితంగా ఉంటుందనే ఫీలింగ్.. ఫ్యాన్స్ లో ఉంది. దానికి రీజన్ ఈ సినిమాలే…

బాహుబలి (మనోహరి)  ఈ సాంగ్ కి కనెక్ట్ అవ్వని ఆడియెన్స్ ఉండరు. ట్యూన్స్ దగ్గరి నుండి విజువల్స్ వరకు ప్రతీది అమేజింగ్ అనిపించుకున్నదే. ఇక అసలు విషయానికి వస్తే సినిమాలో ‘పర్టికులర్ గా రాజ్యంలో కాళకేయ రాయబారి, మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారం దొంగిలించినప్పుడు, తనని వెదుక్కుంటూ  వెళ్ళే సందర్భంలో ఉంటుందీ సాంగ్… ఈ సాంగ్ లో స్కార్లెట్ విల్సన్, నౌరా ఫతేహి, మధు స్నేహ ఉపాధ్యాయ్ ప్రభాస్ తో స్టెప్పులేశారు.

 

మిర్చి: ‘మిర్చిలాంటి కుర్రాడు…’ అంటూ ప్రభాస్ మ్యానరిజాన్ని ఎలివేట్ చేసే సాంగ్. హీరో ఒక పర్టికులర్ ప్లానింగ్ తో ఊరికి వచ్చే సందర్భంలో రోడ్ సాంగ్ ఇది. ఓ రకంగా సినిమా చూస్తున్న ఆడియెన్స్ కి, ఇప్పటి వరకు ఓ లెక్కా.. ఇకనుండి ఓ లెక్కా.. అనే ఫీల్ ని జెనెరేట్ చేయడానికే ఈ సాంగ్ పెట్టారు. హంసా నందిని ఈ పాటలో స్టెప్పులేసింది.

ఏక్ నిరంజన్ – సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కి అసలు కథకి సంబంధమే లేదు. ఓ పర్టికులర్ సిచ్యువేషన్ లో మైకేల్ జాక్సన్ కి ట్రిబ్యూట్ గా ఉంటుందీ సాంగ్… విజువల్స్ ఉన్నా.. కథకి అస్సలు సంబంధం ఉండదు. ఇందులో హీరో ఒక్క స్టెప్పు వేయడు. కానీ ఈ పాటలో కూడా సినిమా కథ నడుస్తుంటుంది.

బుజ్జిగాడు: చిన్నప్పుడెప్పుడో చూసిన చిట్టిని వెదుకుతూ బయలుదేరతాడు హీరో.. నిజానికి రెగ్యులర్ సినిమాల్లో ఈ సాంగ్ ప్రెజెంటేషన్ ఇంకోలా ఉంటుంది.. కానీ మాసివ్ డైరెక్టర్ పూరి ఈ సందర్భాన్ని స్పెషల్ సాంగ్ కి ట్యూన్ చేశాడు. ఈ సాంగ్ లో ముమైత్ ఖాన్ ప్రభాస్ తో స్టెప్పులేసింది.