సాహో ఓవర్సీస్ ప్రీమియర్ వసూళ్లు

Saturday,August 31,2019 - 10:06 by Z_CLU

మొదటి రోజు ఓవర్సీస్ నుంచి సాహోకు భారీ వసూళ్లు వస్తాయని ఆశించారు. నిజానికి మొదటి రోజు వసూళ్లలో ఇది బాహుబలి-2ను కూడా క్రాస్ చేస్తుందనే అంచనాలు వినిపించాయి. కానీ ఓవర్సీస్ లో ఫస్ట్ డే సాహో మెరుపులు పెద్దగా కనిపించలేదు. కలెక్షన్ పరంగా సాహోకు మంచి వసూళ్లు వచ్చినప్పటికీ, రికార్డుల పరంగా ఇది చాలా దూరంలో ఆగిపోయింది.

మొదటి రోజు ఓవర్సీస్ లో సాహోకు 9 లక్షల 15వేల డాలర్లు వచ్చాయి. ఫస్ట్ డే వసూళ్ల పరంగా చూసుకుంటే ఇది ఆరో స్థానంలోనే ఆగిపోయింది. ఓవర్సీస్ లో మొదటి రోజు అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాలివే.

1. బాహుబలి-2 – $2.4M
2. అజ్ఞాతవాసి – $ 1.52M
3. బాహుబలి – $1.39M
4. ఖైదీ నంబర్ 150 – $1.29M
5. స్పైడర్ – $1M
6. సాహో – $0.915M