తమిళంలో రీమేక్ కానున్నRX100

Monday,August 13,2018 - 02:36 by Z_CLU

యూత్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది RX 100 సినిమా. అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్స్ లిస్టులో చేరింది. అయితే ఈ సినిమా ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ కానుంది. ఆది పినిశెట్టి  ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడు.

తెలుగులో కార్తికేయ గుమ్మడికొండ హీరోగా నటించిన RX100 20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దాంతో తమిళ ఫిలిమ్  మేకర్స్ కాన్సంట్రేషన్ ఈ సినిమాపై పడింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ మోస్ట్ ఇంటెన్సివ్ లవ్ స్టోరీ, కోలీవుడ్ లోను సూపర్ హిట్ కావడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిలిమ్ మేకర్స్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫిలిమ్ మేకర్స్ మ్యాగ్జిమం అక్టోబర్ కల్లా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనే ఉన్నారు. ఆరా సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి తక్కిన నటీనటులతో పాటు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో ప్రకటించనుంది సినిమా యూనిట్.