స్పీడ్ మీదున్న ‘RX 100’ హీరో

Thursday,January 17,2019 - 01:10 by Z_CLU

‘RX 100’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో కార్తికేయ, ఆ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా ‘హిప్పీ’ సినిమా సెట్స్ పైకి వచ్చేశాడు. ఫస్ట్ సినిమా సక్సెస్ ఇంపాక్ట్ ఈ సినిమాపై కూడా పడటంతో సినిమా సెట్స్ పై ఉండగానే ఈ  సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ స్టేజ్ లో  ఉండగానే, ఇంకో సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చేశాడు ఈ హీరో.

ఈ రోజు నుండి ఒంగోలులో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకోనుంది కార్తికేయ కొత్త సినిమా.  ఇవాళ్టి నుండి ఫిబ్రవరి 8 వరకు జరగనున్న ఈ భారీ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు, 2 పాటలను కూడా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ సరసన నటించనున్న హీరోయిన్ ఎవరా అన్నది తెలియాల్సి ఉంది.