RRR రన్ టైం ఎంతంటే ?

Saturday,March 19,2022 - 04:55 by Z_CLU

Run Time locked for NTR, Ram Charan’s ‘RRR’

వరల్డ్ మొత్తం ఎప్పుడెప్పుడా ? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న RRR రిలీజ్ కి రెడీ అయింది. మార్చ్ 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే భారీ ప్రమోషన్స్  సినిమాపై ఎక్కడలేని క్రేజ్ తీసుకొచ్చాయి. ఎన్టీఆర్ , చరణ్ లతో రాజమౌళి ఎవరూ చేయని విధంగా ప్రమోషన్స్ చేస్తూ ఇంకా హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు.

అయితే మరో ఐదు రోజుల్లో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కి తాజాగా రన్ టైం లాక్ అయింది. మూడు గంటల ఆరు నిమిషాల నిడివితో సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. ఇటివలే సెన్సార్ పూర్తిచేసుకొని సభ్యుల నుండి U/A సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా రన్ టైం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును ఈ మధ్య ఎక్కువ రన్ టైం ఉంటే సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది. మూవీ లవర్స్ మరీ ఎక్కువ రన్ టైం లాక్ చేశారని మాట్లాడుకుంటున్నారు. కానీ రాజమౌళి కి ఆ లెక్క కరెక్ట్ గా తెలుసు. చెప్పాల్సిన కథ ఎంత వరకూ ఎంత సమయంతో చెప్తే అందరికీ నచ్చుతుందో అంత వరకూ కట్ చేస్తారు. బాహుబలి 2 ని కూడా దాదాపు మూడు గంటల నిడివితో కట్ చేశారు జక్కన్న. ఇప్పుడు కూడా అదే చేశాడు. టికెట్టు పెట్టిన ప్రేక్షకుడికి మూడు గంటల పాటు ఓ విజువల్ వండర్ తో ఎమోషనల్ డ్రామా చూపించబోతున్నాడు జక్కన్న. మరే సినిమా అయినా ప్రేక్షకులు ఇంత సేపా ? అనుకుంటారేమో కానీ రాజమౌళి తన మేజిక్ తో ఎంత సేపు చూపించినా మూవీ లవర్స్ బోర్ ఫీలవ్వకుండా ఎంజాయ్ చేస్తారు. RRR కి కూడా ఇదే జరగబోతుందని కొత్తగా చెప్పనక్కర్లేదు.