ప్రభాస్ హీరోయిన్ పెళ్లికి రెడీ?

Thursday,March 21,2019 - 12:20 by Z_CLU

బాలీవుడ్ లో నిత్యం ఏదో ఒక హీరోయిన్ పెళ్లి కబురు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. గమ్మత్తుగా అవి నిజాలు అవుతుంటాయి కూడా. కత్రినాకైఫ్ ది తప్పిస్తే… కరీనా, సోనమ్, నేహా ధూపియా, దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా లాంటి ఎంతోమంది ముద్దుగుమ్మల విషయంలో బాలీవుడ్ గాసిప్స్ నిజమయ్యాయి. ఇప్పుడిలాంటిదే మరో గాసిప్ పుట్టుకొచ్చింది. హీరోయిన్ శ్రద్ధాకపూర్ పెళ్లి చేసుకుంటుందట.

ప్రస్తుతం ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ, వచ్చే ఏడాది మార్చి లోపు పెళ్లి చేసుకుంటుందంటూ బాలీవుడ్ లో రూమర్స్ నడుస్తున్నాయి. తన చిన్ననాటి స్నేహితుడు, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోషన్ శ్రేష్ఠ్ తో శ్రద్ధాకపూర్ కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోందట. అతడ్నే వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతోందట.

శ్రద్ధాకపూర్ పై ఇంతలా పుకార్లు రావడానికి మరో రీజన్ ఉంది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ నుంచి ఈమె తప్పుకుంది. అప్పట్నుంచి ఈమె పెళ్లిపై ఇలా పుకార్లు వస్తూనే ఉన్నాయి.