Sharwanand Marriage.. ఇది నిజమేనా!

Tuesday,August 25,2020 - 01:27 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. వరుసగా స్టార్ హీరోలు పెళ్లి చేసుకుంటున్నారు. ఈ లాక్ డౌన్ లో Nikhil, Nithiin, Rana పెళ్లిళ్లు చేసుకొని బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆ లిస్టులో శర్వా కూడా చేరబోతున్నాడట. అవును త్వరలోనే హీరో Sharwanand కూడా పెళ్లి పీటలెక్కనున్నాడని తెలుస్తుంది.

చేసిన సినిమాలతో ఇప్పటికే స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శర్వా కు పెళ్లి ఫిక్స్ చేసారట పేరెంట్స్. అయితే శర్వా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ? ఇంతకీ ప్రేమ పెళ్ళా లేదా పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది తెలియాల్సి ఉంది. మరి తన పెళ్లి గురించి ఫ్యాన్స్ కి శర్వా గుడ్ న్యూస్ చేప్పెదెప్పుడో చూడాలి.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రస్తుతం బిజినెస్ ఉమెన్ గా కొనసాగుతున్న ఓ అమ్మాయిని Sharwanand Marriage  చేసుకుంటాడని టాక్. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, పూర్తిగా పెద్దల చేతిలో వ్యవహారమని శర్వానంద్ ఎనౌన్స్ చేశాడు.