హాట్ టాపిక్: RRR వాయిదా?

Saturday,April 11,2020 - 12:30 by Z_CLU

ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ RRR మళ్ళీ పోస్ట్ పోన్ అనే వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే జులై నుండి వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కరోనా.

సినిమాలో యూరప్ కి చెందిన నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం వారు ఇండియాకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్న కొన్ని కంపెనీలు కూడా మూత పడ్డాయి. దీంతో గ్రాఫిక్స్ వర్క్ కూడా పెండింగ్ లో పడింది.

సో.. గ్రాఫిక్ వర్క్ కు అదనంగా మరో 4-5 నెలలు కావాలంట. అలాగే షూటింగ్ కూడా ఇంకా మిగిలుంది. కరోనా ఎఫెక్ట్ వల్ల పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఎప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.

ఈ కారణాలన్నీ చూస్తుంటే RRR సంక్రాంతి నుండి వచ్చే ఏడాది సమ్మర్ కి వెళ్ళే అవకాశం ఉందంటున్నారు చాలామంది. అటు రాజమౌళి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో జనవరి 8కే వచ్చేలా ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు ప్లాన్ రెడీ చేస్తున్నట్టు టాక్.