Raviteja - మాస్ రాజా సినిమాలపై అవన్నీ రూమర్లే !

Wednesday,June 16,2021 - 03:54 by Z_CLU

ఈ ఏడాది ఫిబ్రవరిలో త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా ఎనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. #RT68 గా ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పుకున్నారు మేకర్స్. అయితే కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలోనే ఉండటం ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, పైగా ఉన్నపళంగా రవితేజ శరత్ అనే దర్శకుడితో సినిమా ప్రారంభించడంతో ఈ సినిమా ఆగిపోయిందని రవితేజ నుండి మరో హీరోకి సినిమా షిఫ్ట్ అయ్యిందని ప్రచారం జరిగింది.

అయితే తాజాగా అందిన సమాచారం మేరకు ఈ సినిమా ఆగిపోలేదని తెలుస్తుంది. ఇక స్క్రిప్ట్ రవితేజ నుండి మరో హీరోకి వెళ్ళిందనే వార్తలో ఎలాంటి నిజం లేదని యూనిట్ చెప్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. శరత్ తో రవితేజ చేస్తున్న సినిమాకు సంబంధించి మొదటి షెడ్యుల్ పూర్తవ్వగానే #RT68 సెట్స్ పైకి వెళ్తుందని చెప్తున్నారు.

దీంతో ఈ సినిమా ఆగిందనే విషయంపై క్లారిటీ వచ్చింది. త్వరలోనే సినిమాలో నటించబోయే హీరోయిన్స్ తో పాటు సాంకేతిక నిపుణుల పేర్లు కూడా ప్రకటించి వారికి వెల్కం చెప్పనున్నారు మేకర్స్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగ ర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ చేయనున్నాడు. అందులో ఒక క్యారెక్టర్ హిలేరియస్ గా ఉంటుందని తెలుస్తుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics