Pawan Harish Shankar - మూవీ టైటిల్ ఇదేనా?

Monday,September 06,2021 - 03:41 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జెట్ స్పీడుతో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఒకేసారి రెండు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్న పవన్ నెక్స్ట్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఏడాది క్రితం ఎనౌన్స్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ టైటిల్ చక్కర్లు కొడుతుంది.  ఈ సినిమాకు ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ పెట్టబోతున్నారని తెలుస్తుంది.

గతం పవన్ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ సినిమాకు టైటిల్ బాగా కలిసొచ్చింది. అందుకే మళ్ళీ సింగ్ అనే పదాన్ని రిపీట్ చేస్తూ యూత్ ని ఎట్రాక్ట్ చేసేలా భగత్ సింగ్’ పేరు పెట్టనున్నాడట హరీష్ శంకర్.

అయితే భగత్ సింగ్ కి ముందు భవదీయుడు అనేది కూడా కొత్తగా ఉంది. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ టైటిల్ కథకి యాప్ట్ అయ్యేలా ఉందని మేకర్స్ ఈ డిసిషన్ తీసుకున్నారట.

ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ ఈ టైటిల్ తో ఫ్యాన్స్ మేడ్ పోస్టర్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు హరీష్ శంకర్. పవన్ సరసన పూజా హెగ్డే ని హీరోయిన్ ఫైనల్ చేశారనే టాక్ వినబడుతుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics