Sukumar Vijay Deverakonda - పుకార్లకు చెక్

Monday,April 19,2021 - 07:25 by Z_CLU

సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు…. విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబో సినిమా ఆగిపోయింది. అంటూ సుక్కు-విజయ్ సినిమా గురించి రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. Sukumar-VD కాంబో సినిమాపై ప్రచారం జరుగుతున్న వార్తల్లో నిజం లేదంటూ తెలిపారు. సినిమా అనుకున్న విధంగానే ప్రకటించిన కాంబినేషన్ లోనే రాబోతుందని నిర్మాతలు ప్రెస్ నోట్ ద్వారా మరోసారి తెలియజేశారు.

ప్రస్తుతం సుకుమార్ ‘పుష్ప’ సినిమా చేస్తుండగా విజయ్ పూరి డైరెక్షన్ లో ‘లైగర్’ చేస్తున్నాడని ఈ ఇద్దరూ వారి కమిట్ మెంట్స్ పూర్తి చేసి త్వరలోనే సినిమా చేస్తారని, ఈ కాంబో సినిమా పెద్ద రేంజ్ లో ఉండనుందని చెప్పారు.

అయితే RRR తర్వాత రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఉన్నపళంగా శంకర్ హిందీలో రన్వీర్ తో అపరిచితుడు తీయబోతున్నాడని ప్రకటించాడు. అందుకే ఈ లోపు చరణ్ సుక్కుతో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని, ఇక సుక్కు-విజయ్ కాంబో సినిమా ఇప్పుడే ఉండదని ప్రచారం జరిగింది.

sukumar vijay deverakonda

దీంతో మేకర్స్ ఈ క్రేజీ కాంబో సినిమాపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇస్తూ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని ప్రకటించారు. ఏదేమైనా ఈ మధ్య కొన్ని కాంబినేషన్స్ సినిమాలపై ఎనౌన్స్ మెంట్ నుండే ఇలాంటి రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే ఈ మోస్ట్ ఎవైటింగ్ కాంబో సినిమా మీద అలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయి.

ప్రస్తుతం పుష్ప సినిమాను త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్న సుక్కు ఆ సినిమా షూట్ పూర్తవ్వగానే విజయ్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఫాల్కన్ క్రియేషన్ LLP బేనర్ పై కేదార్ సెలగమశెట్టి నిర్మించనున్న ఈ సినిమాకు ఇంకా కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ అవ్వలేదు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics