రూలర్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,December 23,2019 - 02:33 by Z_CLU

మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. రెండో రోజుకు 60శాతం ఆక్యుపెన్సీ పడిపోయింది. మూడో రోజు వసూళ్లు నార్మల్ గా వచ్చాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి రూలర్ సినిమా రెవెన్యూ పరంగా ఫ్లాప్ అనిపించుకుంది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (మొదటి 3 రోజులు) పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ఏపీ, నైజాంలో కేవలం 5 కోట్ల 88 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 21 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ప్రస్తుతం వస్తున్న వసూళ్ల పరంగా చూస్తే, ఇది బ్రేక్-ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. క్రిస్మస్ సీజన్ కూడా దాటితే సినిమాకు మరిన్ని కష్టాలు తప్పవు.

అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ఆల్రెడీ డిజాస్టర్ అయింది. యూఎస్-కెనడా కలిపి 3 రోజుల్లో కేవలం 15 లక్షల రూపాయలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతో ఈ ఏడాది వరుసగా మూడో ఫ్లాప్ చూశాడు బాలయ్య.

ఏపీ,నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 1.20 కోట్లు
సీడెడ్ – రూ. 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.45 కోట్లు
ఈస్ట్ – రూ. 0.35 కోట్లు
వెస్ట్ – రూ. 0.35 కోట్లు
గుంటూరు – రూ. 1.32 కోట్లు
నెల్లూరు – రూ. 0.30 కోట్లు
కృష్ణా – రూ. 0.31 కోట్లు