30 రోజుల్లో 38 కోట్లు...

Tuesday,December 20,2016 - 10:45 by Z_CLU

నిఖిల్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాతో ఈ ఘనత సాధించాడు నిఖిల్. ప్రారంభం నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రస్తుతం 30 రోజుల్లో 38 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. అటు ఓవర్సీస్ లో కూడా మిలియన్ డాలర్ మార్క్ కు దగ్గరగా ఉంది. నిజానికి 30 రోజుల్లో 38కోట్లు కలెక్షన్లు అంటే అదేమంత పెద్ద విషయం కాదు. కానీ ఈ సినిమా విడుదలైన పరిస్థితుల్లో ఇన్ని వసూళ్లు అంటే అది కచ్చితంగా వండరే. డబ్బుల్లేక జనాలు ఇబ్బందిపడుతున్న టైమ్ లో, పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమా విడుదలైంది. చివరికి రామ్ చరణ్ కూడా తన ధృవ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోగా… నిఖిల్ మాత్రం ధైర్యంగా బాక్సాఫీస్ లోకి అడుగుపెట్టాడు. ఆ ధైర్యం, సినిమాపై ఉన్న నమ్మకమే నిఖిల్ కు ఓ మంచి విజయాన్ని అందించింది. త్వరలోనే ఈ సినిమా 40కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది. అదే కనుక జరిగితే, నిఖిల్ కూడా ఎన్టీఆర్, బన్నీ, మహేష్ బాబు లాంటి హీరోల సరసన 40కోట్ల క్లబ్ లోకి చేరిపోతాడన్నమాట.