#RRRMassAnthem ఫాన్స్ కి పండగే !

Wednesday,November 10,2021 - 04:15 by Z_CLU

ఇద్దరు క్రేజీ స్టార్ హీరోలు కలిసి స్క్రీన్ పై మాస్ స్టెప్స్ వేస్తే… ఆ సాంగ్ చూస్తూ ఫ్యాన్స్ సీట్లో కూర్చోవడం కష్టమే. తమ అభిమాన హీరోలు మాస్ సాంగ్ కి ఊర మాస్ స్టెప్స్ వేస్తుంటే వారిలో కూడా చలనం కలిగి ఊపు రావడం ఖాయం. సరిగ్గా RRR నుండి రిలీజైన సాంగ్ అలాంటి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఇటు తారక్ , అటు రామ్ చరణ్ ఇద్దరూ నాటు నాటు అంటూ రిలీజ్ కి ముందే ఫ్యాన్స్ కి పండగ తీసుకొచ్చారు. ఇటివలే ప్రోమోతో తారక్ , చరణ్ ఏ రేంజ్ లో డాన్స్ వేసారో ట్రయిల్ గా చూపించిన మేకర్స్ తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ వదిలి మూవీ లవర్స్ లో మంచి జోష్ తీసుకొచ్చారు.

ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ కి చంద్ర బోస్ అంతే మాస్ లిరిక్స్ అందించాడు. ఇక లిరికల్ వీడియో లో తారక్ , చరణ్ డాన్స్ విజివల్స్ చూస్తే ఈ సాంగ్ కి థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ అల్టిమేట్ అనిపిస్తున్నాయి. ఫైనల్ గా RRR నుండి ‘నాటు నాటు’ అంటూ విడుదలైన ఈ లిరికల్ సాంగ్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి  కూడా మంచి విజువల్ ట్రీట్ అనిపించేలా ఉంది.

తెలుగు , తమిళ్ , హిందీ , కన్నడ , మలయాళం  భాషల్లో రిలీజైన ఈ మాస్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ రికార్డు స్థాయి వ్యూస్ కొల్లగొడుతుంది. DVV ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. బాహుబలి 2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి.

– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics