ఆర్ఆర్ఆర్ టైటిల్ రిలీజ్.. మోషన్ పోస్టర్ అదుర్స్

Wednesday,March 25,2020 - 01:15 by Z_CLU

ఉగాది సందర్భంగా మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఆర్ఆర్ఆర్ కు సంబంధించి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పనిలోపనిగా మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈ సినిమాకు రౌద్రం-రణం-రుధిరం అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

తెలుగులో ఈ టైటిల్ ను డీవీవీ దానయ్య తన యూట్యూబ్ ఛానెల్ పై రిలీజ్ చేయగా.. మలయాళం మోషన్ పోస్టర్ ను చరణ్, తమిళ మోషన్ పోస్టర్ ను ఎన్టీఆర్, హిందీ మోషన్ పోస్టర్ ను అజయ్ దేవగన్ రిలీజ్ చేశారు.

హిందీలో ఈ సినిమాకు రైజ్-రోర్-రివోల్డ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పాన్-ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాకు యూనివర్సల్ అప్పీల్ కోసం ఇలా ఇంగ్లిష్ టైటిల్ పెట్టారు.

ఇక మోషన్ పోస్టర్ విషయానికొస్తే.. నీరు-నిప్పు కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ ను క్రియేట్ చేశాడు రాజమౌళి. నిప్పు బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ పరుగెత్తుకుంటూ వస్తాడు. నీరు బ్యాక్ డ్రాప్ తో ఎన్టీఆర్ పరుగెడతాడు. వీళ్లిద్దరూ అలా వచ్చి చేతులు కలిపే సందర్భంలో ఆర్ఆర్ఆర్ టైటిల్ పడుతుంది.

ఈ నీరు-నిప్పు బ్యాక్ గ్రౌండ్ కు సినిమాకు ఏదో లింక్ ఉన్నట్టుంది. లేకపోతే రాజమౌళి ఈ కాన్సెప్ట్ ఎంచుకోడు. ఇక టైటిల్ తో 2 విషయాలపై స్పష్టత ఇచ్చారు. 1920 కాలంలో ఇండియాలో జరిగిన ఓ ఫిక్షన్ కథతో ఆర్ఆర్ఆర్ వస్తుందనే విషయాన్ని మోషన్ పోస్టర్ లో చెప్పారు. దీంతో పాటు జనవరి 8న రిలీజ్ అనే విషయాన్ని కూడా మరోసారి స్పష్టంచేశారు.