RRR Song - ఫ్రెండ్ షిప్ డే స్పెషల్

Thursday,July 22,2021 - 06:26 by Z_CLU

RRR కి సంబంధించి ఓ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి. తారక్ , చరణ్ లతో పాటు రాజమౌళితో వర్క్ చేసిన హీరోలందరూ ఈ సాంగ్ లో కనిపించనున్నారని సమాచారం. ప్రభాస్ , రవితేజ , నాని , సునీల్ ఇలా అందరూ తారక్ , చరణ్ లతో కలిసి డాన్స్ చేస్తారట. ఈ వారంలో షూట్ కంప్లీట్ చేసి వచ్చే నెల ఆగస్ట్ లో ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ ప్రోమో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడట జక్కన్న.

అంతే కాదు ఈ సాంగ్ ని ప్రమోషన్స్ కోసం వాడటమే కాకుండా సినిమా రోలింగ్ టైటిల్స్ లో వేసే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. మగధీర కి కూడా అలాగే ఓ సాంగ్ షూట్ చేసి దాన్ని రోలింగ్ టైటిల్స్ కి వాడుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రమోషనల్ సాంగ్ కూడా అలాగే డిజైన్ చేసి RRR ప్రమోషన్ లో ఊపు తీసుకురాబోతున్నాడట జక్కన్న. ఈ సాంగ్ లో స్టార్స్ తో పాటు సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ కూడా కనిపించి డాన్స్ చేస్తారట.

RRR movie working stills zeecinemalu

ఇక ఓకె ఫ్రేమ్ లో ఎన్టీఆర్ , చరణ్ , ప్రభాస్, రవితేజ , నాని , సునీల్ ఇలా రాజమౌళి హీరోలంతా కనిపిస్తూ మన ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారన్నమాట. ఇంతమంది స్టార్స్ ఓకె సాంగ్ లో చూడటం అంటే సినీ ప్రేమికులకు కావాల్సి ఏముంటుంది. ఏదేమైనా రాజమౌళి తన మార్కెటింగ్ స్టాటజీతో RRR ని కూడా మరో స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. ఇప్పటికే టీజర్స్ ,మేకింగ్ వీడియోస్ తో హంగామా చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పిన జక్కన్న ఇప్పుడు ఈ సాంగ్ తో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics