ఎన్టీఆర్-రామ్ చరణ్ మూవీ షూటింగ్ అప్ డేట్స్

Monday,October 22,2018 - 01:29 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించనున్న మల్టీస్టారర్ కు డేట్ ఫిక్స్ అయింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం నవంబర్ 16 నుంచి ఈ మోస్ట్ ఎవెయిటింగ్ మల్టీస్టారర్ సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. ముందుగా తారక్ పై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నాడు జక్కన్న.

మల్టీస్టారర్ కు సంబంధించి ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పూర్తిచేశాడు రాజమౌళి. చరణ్, ఎన్టీఆర్ లుక్స్ ను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు హీరోయిన్లను కూడా లాక్ చేసినప్పటికీ, ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

డి.వి.వి ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నాడు.