RRR Release - రాజమౌళి సెకండ్ ప్లానేంటి?
Wednesday,February 09,2022 - 08:15 by Z_CLU
RRR Release – What is Rajamouli’s Plan B
జనవరి 7న రిలీజ్ అంటూ RRR సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేశాడు రాజమౌళి. ఎవరి ఊహకి అందని విధంగా ప్రమోషన్స్ లో కొత్త స్టాటజీ చూపించాడు. ఎన్టీఆర్ , చరణ్ లను ముంబై , బెంగళూరు , చెన్నై తిప్పి అక్కడ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయించాడు. ముంబై లో భారీ ఎత్తున ఈవెంట్ చేసి ఔరా అనిపించాడు. కానీ సినిమా ఓమిక్రాన్ ఎఫెక్ట్ తో పోస్ట్ పోన్ అయింది. దీంతో రాజమౌళి సైలెంట్ అయిపోయాడు. ఇటివలే మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. వచ్చే నెల 25న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు.
కానీ ఇంత వరకూ ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో మూవీ లవర్స్ అంతా రాజమౌళి స్టాటజీ ఏంటి ? ఈసారి ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేస్తాడు ? అని అందరూ ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇప్పటికే తన టీంతో కొన్ని ప్లాన్స్ వేస్తున్నాడు జక్కన్న. ముంబైలో చేసినట్టే హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ ఈవెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ ఈవెంట్ కి మెగా స్టార్ , ప్రభాస్ లను చీఫ్ గెస్ట్స్ గా పిలిచి భారీ ఎత్తున ఈవెంట్ చేయాలని చూస్తున్నాడట. అలాగే రిలీజ్ కి సరిగ్గా నెల ముందు మళ్ళీ హీరోలను అలాగే అలియా ను బరిలోకి దింపు మళ్ళీ ప్రెస్ మీట్స్ అంటూ ఓ రౌండ్ వేయించానున్నాడు. ఇవే కాకుండా రిలీజ్ ట్రైలర్ , కొన్ని ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారట.
అలాగే యాడ్స్ పరంగా కొన్ని కంపెనీలతో టయప్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. ఇలా మళ్ళీ తన ప్రమోషన్ ప్లాన్స్ తో జనాల్లోకి తీసుకెళ్లనున్నాడురాజమౌళి. మరికొన్ని రోజుల్లోనే మళ్ళీ RRR హవా స్టార్ట్ చేసి సోషల్ మీడియాలో హంగామా చేయనున్నాడు రాజమౌళి.