RRR భారీ హైప్ క్రియేట్ చేసిన జక్కన్న !

Saturday,November 13,2021 - 12:00 by Z_CLU

‘బాహుబలి2’ తర్వాత ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి సినిమా అనగానే RRR పై అంచనాలు మొదలయ్యాయి. అక్కడి నుండి సినిమాపై రోజు రోజుకి అంచనాలు మరింత పెరుగుతూ వచ్చాయి. కానీ ఒక్కసారిగా గ్లిమ్స్ వదిలి సినిమాపై ఎక్కడలేని భారీ హైప్ తీసుకొచ్చాడు జక్కన్న. ఇటివలే సినిమాలో కొన్ని బెస్ట్ షాట్స్ తో 46 సెకన్ల నిడివితో రిలీజైన RRR గ్లిమ్స్ ఇండియన్ మూవీ లవర్స్ అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాపై నెక్స్ట్ లెవెల్ అంచనాలు పెంచాయి.

ఆ గ్లిమ్స్ గురించి మాట్లాడుకుంటుండగానే సినిమాలోని అదిరిపోయే మాస్ సాంగ్ ని రిలీజ్ చేసి సినిమా ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాడు రాజమౌళి. తారక్ , చరణ్ స్పీడ్ స్టెప్స్ తో ‘నాటు నాటు’ సాంగ్ వైరల్ అయిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సాంగే వినబడుతుంది. ముఖ్యంగా లిరికల్ వీడియోలో ఇద్దరూ పోటా పోటీగా డాన్స్ చేస్తున్న విజువల్స్ కూడా ఎటాచ్ చేసి మూవీ లవర్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చాడు జక్కన్న.

మొన్నటి వరకు RRR ప్రమోషన్స్ ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్టుగా రాజమౌళి సరికొత్త ప్లానింగ్ తో వెళ్తున్నారు. మల్టీ ప్లెక్స్ లో అతిపెద్ద సంస్థ అయిన PVR పేరుకి RRR జత చేయడం దగ్గర నుండి సినిమా ప్రమోషన్స్ లో పెద్ద చేంజ్ కనబడింది. ఆ వెంటనే గ్లిమ్స్ , ఇప్పుడు “నాటు నాటు” అనే మాస్ సాంగ్ ఇలా సినిమా కంటెంట్ పై హింట్ ఇస్తూ రాజమౌళి చేస్తున్న ప్రమోషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతూ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతూ ప్రాజెక్ట్ పై భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఏదేమైనా ఒక దర్శకుడిగా భారీ సినిమా చేయడమే కాదు దాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడం కూడా జక్కన్నకి బాగా తెలుసు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics