#RRR - ఇప్పుడు కీరవాణి టైం!

Saturday,July 17,2021 - 10:41 by Z_CLU

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి తీస్తున్న మోస్ట్ ఎవైటింగ్ సినిమా ‘RRR’ నుండి లేటెస్ట్ గా మేకింగ్ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుండే భారీ స్థాయిలో ప్రమోషన్ చేస్తూ తన మార్కెటింగ్ స్టాటజీతో ప్రాజెక్ట్ పై క్రేజ్ తీసుకొచ్చిన రాజమౌళి నెక్స్ట్ ప్రమోషన్ బాధ్యత ను తన అన్నయ్య కీరవాణి పై పెట్టేశాడట. అవును ఇప్పటి వరకు మేకింగ్ వీడియోస్ , టీజర్స్ తో తీసుకొచ్చిన ఇంపాక్ట్ ని ఇకపై కీరవాణి పాటలతో ముందుకు తీసుకెళ్ళనున్నారట.

ఇప్పటికే సినిమాకు సాంగ్స్ అన్నీ కంపోజ్ చేసి మరో పక్క ఆర్ ఆర్ కూడా చకచకా చేసేస్తున్నారు కీరవాణి. త్వరలోనే ఆల్బం నుండి మొదటి పాటను రిలీజ్ చేయనున్నారని సమాచారం. అక్కడి నుండి ఒక్కో పాటతో సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేయబోతున్నారు. బాహుబాలి ఫ్రాంచైజీ కి అదిరిపోయే సాంగ్స్ తో పాటు గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన కీరవాణి ఆర్ ఆర్ ఆర్ కి అలాంటి సపోర్ట్ అందించనున్నాడట.

కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేయడం ఖాయమని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాలకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని గట్టిగా చెప్తున్నారు. బాహుబలి లో విగ్రహ ప్రతిస్థ సన్నివేశానికి తన నేపథ్య సంగీతంతో ప్రేక్షకులకు రోమాలు నిక్కపోడిచేలా చేసిన కీరవాణి RRR లో ఎన్టీఆర్ , చరణ్ లు కలిసినప్పుడు అలాగే మిగతా కీలక సన్నివేశాలు అదే రేంజ్ మ్యూజిక్ ఇచ్చారట. మరి చూడాలి కీరవాణి మ్యూజిక్ సినిమాకు ఏ రేంజ్ ప్లస్ అవుతుందో..!

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics