ఆర్-ఆర్-ఆర్ హీరోయిన్లు.. ఎప్పట్నుంచి సెట్స్ పైకి?

Thursday,March 28,2019 - 05:23 by Z_CLU

ఆర్-ఆర్-ఆర్ సినిమాలో హీరోయిన్లు ఎవరనేది తెలిసిపోయింది. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని బయటపెట్టాడు రాజమౌళి. రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన ఓ ఫారిన్ ముద్దుగుమ్మ నటించబోతున్నారనే విషయాన్ని బయటపెట్టారు. అయితే వీళ్లిద్దరు ఎప్పుడు సెట్స్ పైకి వస్తారనేది మొన్నటివరకు డౌట్. ఇప్పుడా సందేహానికి కూడా సమాధానం దొరికేసింది.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి వచ్చే వారం నుంచి నార్త్ ఇండియాలో ఓ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ షెడ్యూల్ లో హీరోయిన్లు అలియాభట్, డైసీ జోన్స్ పాల్గొంటారు. ఇదే షెడ్యూల్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు.

1920ల నాటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.