RRR Movie - ట్రయిలర్ రివ్యూ

Thursday,December 09,2021 - 01:04 by Z_CLU

RRR Movie Trailer Review

సినిమా ట్రయిలర్ విడుదలకు ముందు కొన్ని అంచనాలుంటాయి, ట్రయిలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు కాస్త మారుతాయి. కానీ RRR Movie ట్రయిలర్ మాత్రం సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఇప్పటికే ఆకాశాన్నంటిన అంచనాలు, ట్రయిలర్ రిలీజ్ తర్వాత లిమిట్స్ దాటిపోయాయి.

అయితే ఇది రాజమౌళి సినిమా. ఎన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చు. అందరి అంచనాల్ని అందుకుంటాడు, అంచనాల్ని మించి సినిమా చూపిస్తాడు. ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ విషయంలో అదే జరిగింది. ఈరోజు రిలీజైన ట్రయిలర్, అదిరిపోయింది. విజువల్స్, యాక్షన్, పెర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్.. ఇలా ఏ కోణంలో తీసుకున్నా హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఆర్ఆర్ఆర్ ట్రయిలర్.

ఇక ట్రయిలర్ లో కంటెంట్ విషయానికొస్తే.. రామ్, భీమ్ పాత్రల్ని లావిష్ గా పరిచయం చేశాడు రాజమౌళి. ఆ తర్వాత ఆ పాత్రల మధ్య దోస్తీ చూపించాడు. రెండు పాత్రల మధ్య కాన్ ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేశాడు. చివర్లో రెండు పాత్రల్లోకి అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ప్రవేశించినట్టు చూపించాడు. ఇద్దరూ కలిసి చేతులు కలిపి క్లైమాక్స్ లో ఏం చేశారనేది కూడా చూపించాడు. ఇలా అంచనాల్ని మించి ట్రయిలర్ లో అన్నీ చూపించాడు జక్కన్న.

3 నిమిషాల 7 సెకెన్ల రన్ టైమ్ ఉన్న ఈ ట్రయిలర్ లో సినిమాలో కీలకమైన ట్రయిన్ ఫైట్, టైగర్ ఫైట్, ఫారెస్ట్ ఫైర్ ఫైట్ కు సంబంధించిన గ్లింప్స్ ను కూడా చూపించాడు రాజమౌళి. వీటితో పాటు మూవీలో ముఖ్య పాత్రలు పోషించిన రాజీవ్ కనకాల, అలియాభట్, అజయ్ దేవగన్, సముత్తరఖని లాంటి పాత్రల్ని కూడా చూపించాడు.

ఓవరాల్ గా ఆర్ఆర్ఆర్ ట్రయిలర్ తో సినిమాపై ఎన్ని అంచనాలైనా పెట్టుకోవచ్చని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 7న థియేటర్లలోకి వస్తోంది ఈ మూవీ. ఎన్టీఆర్, రామ్ చరణ్ విశ్వరూపాన్ని సిల్వర్ స్క్రీన్ పై కళ్లారా చూడాలంటే మరో నెల రోజులు నిరీక్షణ తప్పదు.