RRR - షూట్ మొదలైంది

Monday,October 05,2020 - 01:34 by Z_CLU

లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన RRR షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఈ రోజే హైదరాబాద్ లో Rajamouli అండ్ టీం షూట్ మొదలు పెట్టారు. ప్రస్తుతం కొన్ని రోజులు ట్రయిల్ షూట్ చేయబోతున్నారు. ఈ షూట్ లో NTR టీజర్ కి సంబంధించి కొన్ని షాట్స్ కూడా తీయనున్నారు.

దాదాపు వారం పైన టెస్ట్ షూట్ జరగనుందని సమాచారం. ఈ షూటింగ్ తర్వాత టీం ఓ 10 రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ విజయదశమి తర్వాత షెడ్యుల్ ప్లాన్ చేస్తారు. ఆ షెడ్యుల్ లో NTR Ramcharan లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు.

వచ్చే ఏడాది సమ్మర్ లోపే టోటల్ షూట్ పూర్తి చేసి ఆరునెలలు పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించనున్నాడు జక్కన్న. DVV Danayya నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.