వర్కింగ్ టైటిల్ కాదు... ఒరిజినల్ టైటిల్

Thursday,March 14,2019 - 12:55 by Z_CLU

రకరకాల స్పెక్యులేషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు రాజమౌళి. ఎప్పటిలాగే  ఈ సినిమాకి సంబంధించిన విషయాలు కూడా రివీల్ చేసేశాడు. దాంతో టైటిల్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. సినిమా అనౌన్స్ చేసినప్పుడు జస్ట్ వర్కంగ్ టైటిల్ గా ‘RRR’ అనుకున్నాం కానీ, ఇప్పుడు అన్ని వైపుల నుండి టైటిల్ ఇదే బావుందని ఒత్తిడి రావడంతో ఈ టైటిల్ నే ఫైనల్ చేసుకున్నాం. RRR జస్ట్ వర్కింగ్ టైటిల్ కాదు, ఒరిజినల్ టైటిల్’  అని కన్ఫమ్ చేశాడు రాజమౌళి.

నిజానికి ‘RRR’ అనేది అన్ని భాషలలోను కామన్ టైటిల్ అవుతుంది. అందుకే ప్రస్తుతానికి మేం కూడా ఈ టైటిల్ కే ఫిక్సవుతున్నాం. ఒకవేళ ఫ్యూచర్ లో ఏదైనా అనిపిస్తే మారే చాన్సెస్ ఉంటాయి కానీ ప్రస్తుతానికి టైటిల్ మాత్రం ఇదే.’ అని చెప్పుకున్నాడు జక్కన్న.

 

RRR అనౌన్స్ అయినప్పుడే ‘మల్టీస్టారర్ అంటే…ఇది’ అనిపించుకుంది. దానికి తోడు రాజమౌళి లాంటి ఇంటర్నేషనల్ స్థాయి ఉన్న దర్శకుడి సినిమా కాబట్టి ముగ్గురి పేర్లలోని మొదటి అక్షరంతో ఫిక్స్ అయిన ఈ వర్కింగ్ టైటిల్, ఫైనల్ టైటిల్ అనిపించుకుంటుందని ఫ్యాన్స్ కూడా గెస్ చేయలేదు.

కాకపోతే రాజమౌళి చివరన ఒకవేళ ఏదైనా అనిపిస్తే అప్పటికి ఆలోచిస్తాం అని జోడించడంతో అక్కడక్కడా, టాలీవుడ్ ‘RRR’ అంటే స్టార్ డమ్ టచ్ అవుతున్న టైటిల్ కాబట్టి ఓకె… మరి ఇతర భాషల్లోకి..? ‘RRR’ స్టార్ రిలేటెడ్ టైటిల్ కాబట్టి రిలీజ్ డేట్ దగ్గరపడే నాటికి  కథకి రిలేటెడ్ టైటిల్ కావాలనే డిమాండ్ కూడా వచ్చే చాన్సెస్ ఉన్నాయని అనిపిస్తుంది.