ఆర్-ఆర్-ఆర్.. మరో హీరోయిన్ ఫిక్స్

Wednesday,August 21,2019 - 12:23 by Z_CLU

ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే హీరోయిన్లను ఫిక్స్ చేశారు. అలియా భట్ తో పాటు మరో ఫారిన్ బ్యూటీని ఎంపిక చేశారు. కానీ వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి విదేశీ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకుంది. ఇప్పుడా స్థానాన్ని మరో హాలీవుడ్ నటితో భర్తీ చేశారు.

హాలీవుడ్ నటిని ఎంపిక చేసిన విషయాన్ని నిర్థారించిన ఆర్-ఆర్-ఆర్ యూనిట్.. ఆ అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. ఓ మంచి అకేషన్ చూసి ఆ పేరును ఎనౌన్స్ చేయబోతున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, హాలీవుడ్ నటి ఎమ్మా రాబర్ట్స్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిలో కొమరం భీమ్ పాత్ర ఓ బ్రిటిష్ యువతితో ప్రేమలో పడుతుంది. ఆ పాత్ర కోసం ఎమ్మా రాబర్ట్స్ ను సెలక్ట్ చేశారు.

దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాజమౌళి డైరక్ట్ చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30న ఆర్-ఆర్-ఆర్ ను రిలీజ్ చేస్తారు.