చరణ్ బర్త్ డే గిఫ్ట్ రెడీ అవుతుందా ?

Wednesday,February 19,2020 - 11:13 by Z_CLU

రాజమౌళి డైరెక్షన్ లో తారక్, రామ్ చరణ్   నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్  మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఇంత వరకూ ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు జక్కన్న. ఇప్పుడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ కి సంబంధించి ఓ డిజైన్ కూడా లాక్ చేసారని సమాచారం.

మార్చ్ 27న చరణ్ బర్త్ డే సందర్భంగా ‘ఆర్ ఆర్ ఆర్’ ఫస్ట్ లుక్ తో విషెస్ చెప్పబోతున్నారు టీం. అయితే ఈ ఫస్ట్ లుక్ లో కేవలం చరణ్ మాత్రమే కనిపిస్తాడా లేదా తారక్ తో కలిసి ఓ స్టిల్ తో విషెస్ అందుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న థియేటర్స్ లో రాబోతుంది.