RRR Songs - ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Tuesday,July 27,2021 - 04:39 by Z_CLU

రాజమౌళి – కీరవాణి కాంబినేషన్ లో రానున్న RRR ఆల్బం పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వీరిద్దరి కాంబో లో ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ ఆల్బమ్స్ గ్రాండ్ సక్సెస్ సాధించడమే దీనికి రీజన్. కీరవాణి కాకుండా ఇంత వరకు మరో మ్యూజిక్ డైరెక్టర్ తో సినిమా చేయలేదు రాజమౌళి. ‘బాహుబాలి’ ఫ్రాంచైజీ తో ఈ కాంబో వరల్డ్ వైడ్ గా మరింత పాపులర్ అయింది. దీంతో RRR సాంగ్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.

ఇక ఈ ఆల్బం నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు రాజమౌళి. ముందుగా ఫస్ట్ సింగిల్ తో భారీ హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే కీరవాణి ఈ సినిమా కోసం స్నేహం మీద ఓ అదిరిపోయే సాంగ్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ ని ఒక్కో భాషలో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ / సింగర్ తో పాడించారు. తెలుగులో హేమ చంద్ర ఈ పాటను పాడగా … తమిళ్ లో అనిరుద్ , హిందీలో అమిత్ త్రివేది , మలయాళంలో విజయ్ ఏసుదాస్ , కన్నడలో యాసిన్ నిజార్ పాడారు.

rrr 1st songrrr 1st song

ఆగస్ట్ 1న ఉదయం 11 గంటలకు ఫస్ట్ సింగిల్ రానుంది. తెలుగులో దోస్తీ పేరుతో అలాగే మిగతా భాషల్లో అదే టైంకి సాంగ్ రిలీజ్ అవ్వనుంది. తెలుగులో ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ స్నేహ గీతం విడుదల చేయనుండటం విశేషం. ఈ సాంగ్ ని ప్రమోషనల్ సాంగ్ గా షూట్ చేస్తున్నాడు రాజమౌళి. అందులో తారక్ , చరణ్ లతో పాటు మిగతా స్టార్ హీరోలు కూడా కనిపిస్తారని సమాచారం. ఆ సాంగ్ ని సినిమా రోలింగ్ టైటిల్స్ లో వేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics