ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా అనౌన్స్ మెంట్

Thursday,March 22,2018 - 07:02 by Z_CLU

సెట్స్ పైకి వెళ్ళకుండానే మోస్ట్ ఎవైటింగ్ మూవీగా అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్.  బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మించనున్నాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. రాజామౌళి, రామారావు, రాం చరణ్ పేర్లతో #RRR అంటూ మూడు పేర్లతో ఓ వీడియో ను రిలీజ్ చేశారు.


ఈ మధ్యే ఈ సినిమా కోసం ఎన్టీఆర్-చరణ్ లాస్ ఎంజెల్స్ వెళ్ళిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరిపై అక్కడ టెస్ట్ షూట్ చేశారు. జులై నుంచి ఎన్టీఆర్, చరణ్ తో వర్క్ షాప్ స్టార్ట్ చేయబోతున్నాడు జక్కన్న. దీనికి ప్రీ-విజువలైషన్ అనే పేరు కూడా పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రీన్ ప్లే పూర్తిచేశాడట రాజమౌళి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ నుంచి ఈ మల్టీస్టారర్ మూవీ సెట్స్ పైకి వస్తుంది.