RRR-Acharya.. ఈ రెండే ముందు!

Saturday,September 12,2020 - 11:46 by Z_CLU

కరోనా ఎఫెక్ట్ తర్వాత మెల్లగా షూటింగ్స్ మొదలవుతున్నాయి.ఇప్పటికే కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసుకుంటున్నాయి. అయితే ఇంకా స్టార్ హీరోల సినిమాలపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. తాజా అప్డేట్ ప్రకారం అక్టోబర్ నెలాఖరున లేదా నవంబర్ మొదటి వారం నుండి బడా సినిమాల షూటింగ్స్ మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది.

ముందుగా RRR, Acharya సెట్స్ పైకి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే మిగిలిన షూటింగ్ చేసేందుకు ఇటు Rajamouli అటు Koratala Siva ఇద్దరూ పర్ఫెక్ట్ ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నారని తెలుస్తుంది. వీటికి సంబంధించి తక్కువ మందితో షూట్ చేసేలా సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ RRR షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్ లోనే జరగనుంది. అలాగే Acharya రామోజీ ఫిలిం సిటీలో ఒక షెడ్యుల్ జరుపుకోనుంది. ఈ రెండు షూటింగ్స్ ప్రారంభమయ్యాక మరిన్ని బడా సినిమాలు సెట్స్ పైకి రానున్నాయి.