Rowdy Boys to release on January 14
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన సినిమా ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నాడు ఆశిష్ (శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.

రౌడీ బాయ్స్ సినిమా 14వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్లు రిలీజ్ చేశారు. ఓ డెబ్యూ హీరోకు సంక్రాంతి డేట్ దొరకడం చాలా పెద్ద ఎఛీవ్ మెంట్. ఈ విషయంలో ఆశిష్ ను అదృష్టవంతుడు అంటున్నారంతా. అనుపమ పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్.
రౌడీ బాయ్స్ పక్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ రౌడీ బాయ్స్ టైటిల్ ట్రాక్, ప్రేమే ఆకాశమైతే అనే పాటలు విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో లవ్ కంటెంట్ చాలా కొత్తగా ఉండబోతోంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

యూత్‌ఫుల్ మూవీ కావడంతో దీనికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుందనడంలో సందేహం లేదు. దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాలో పాటలకు వచ్చిన రెస్పాన్సే అందుకు ఎగ్జాంపుల్. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు మేకర్స్.