రౌడీ అల్లుడు @25

Tuesday,October 18,2016 - 03:49 by Z_CLU

ఆటో జానీగా అలరించిన మెగాస్టార్ ‘రౌడీ అల్లుడు’ రిలీజయి ఇవాళ్టికి పాతికేళ్ళు. కోట్లాది రూపాయ‌ల ఆస్తికి వార‌సుడు అయిన ఓ బిజినెస్ మ్యాగ్నెట్ (క‌ల్యాణ్‌)ని మోసం చేసి ఆస్తి కొట్టేయాల‌ని, అదే పోలిక‌తో ఉన్న ఆటో జానీని తెచ్చి కుట్ర చేస్తే, అస‌లు నిజం తెలుసుకున్న ఆటోజానీ ఆ దుర్మార్గుల పాలిట య‌మ‌కింక‌రుడిగా ఎలా మారాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘రౌడీ అల్లుడు’ అప్పట్లో బాక్సాఫీస్ కలెక్షన్లలో పెద్ద విప్లవమే తీసుకొచ్చింది.

hycp02creatorsc_hy_1257944g

ఏదైనా డ్యూయల్ రోల్ తో సినిమా చేద్దాం అని చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో తన మనసులో మాట చెప్పీ చెప్పగానే ఇమ్మీడియట్ గా కథ తయారయి సెట్స్ పైకి వచ్చిందే ఈ రౌడీ అల్లుడు. కథనందించిన సత్యానంద్, దానిని మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా సరికొత్త మ్యానరిజం తో క్యారెక్టర్స్ ని ప్లాన్ చేసుకున్న రాఘవేంద్ర రావు గారు, ఇప్పటికీ యూత్ ని ఆకట్టుకునేలా సంగీతం అందించిన బప్పీలహరి ఏమైతేనేం “రౌడీ అల్లుడు” సూపర్ హిట్టయింది.

‘ఇదర్ కా మాల్ ఉదర్, ఉదర్ కా మాల్ ఇదర్’ అంటూ చిన్నచిన్న మోసాలు చేస్తూ, ఆటో నడుపుకుంటూ తన జీవనాన్ని సాగించే ఆటో జానీ పాత్రలో చిరంజీవి అప్పట్లో థియేటర్స్ ఉన్న ప్రతి జంక్షన్ ను జామ్ చేసి పడేశాడు. ఆ సినిమాలో ఆయన పండించిన కామెడీ, ఆ బాడీ లాంగ్వేజ్, ముఖ్యంగా చిరంజీవి మ్యానరిజం కి అభిమానుల్లో ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది.