ఎలిజిబుల్ బ్యాచిలర్ క్వారంటైన్ లుక్

Wednesday,July 29,2020 - 03:14 by Z_CLU

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు సంబంధించి అఖిల్ ఫస్ట్ లుక్ ఇప్పటికే వచ్చింది. పూజా హెగ్డే లుక్ కూడా ఆల్రెడీ రిలీజైంది. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసిన లుక్ ను విడుదల చేశారు.

అఖిల్ తో రొమాన్స్ చేస్తున్న పూజా హెగ్డే స్టిల్ ను ఈరోజు రిలీజ్ చేశారు. పోస్ట‌ర్ లో అఖిల్ వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ రొమాంటిక్ ఫీల్ తీసుకొచ్చింది.

ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లో పాత్ర‌లు చాలా క్యూట్ రొమాన్స్ తో ల‌వ్లీగా వుండే కేర‌క్ట‌ర్స్ ని డిజైన్ చేస్తాడు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ స్పెషాలిటి వుంటుంది. అఖిల్-పూజా మ‌ధ్య ఎలాంటి కెమిస్ట్రి వుండ‌బోతుందో ఈ పోస్ట‌ర్ డిజైనింగ్ లో చ‌క్క‌గా చూపించాడు ద‌ర్శ‌కుడు.

సినిమాకు సంబంధించి 70శాతం షూట్ పూర్తయింది. లాస్ట్ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతోంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ.