రిలీజ్ కి రెడీ అవుతున్న రోగ్

Friday,March 24,2017 - 04:00 by Z_CLU

ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘రోగ్’ రిలీజ్ కి రెడీ అవుతుంది.. ఇటీవలే ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. ఇప్పటికే ట్రైలర్ తో మోస్తరు అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాను మార్చ్ 31 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..

మరో చంటి గాడి ప్రేమ కథ అనే కాప్షన్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత సి.ఆర్.మనోహర్ తమ్ముడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు ఇషాన్.. కన్నడ తెలుగు భాషల్లో ఒకే సారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఈ యాంగ్ హీరో ఎలాంటి హిట్ సాదిస్తాడో..చూడాలి.