రోగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

Tuesday,February 14,2017 - 05:19 by Z_CLU

పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమా రోగ్. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పూరి స్టయిల్ లోనే డిఫరెంట్ గా ఉంది రోగ్ పోస్టర్. టైటిల్ ను కూడా సంథింగ్ స్పెషల్ గా డిజైన్ చేశారు. ప్రముఖ నిర్మాత సీఆర్ మనోహర్ తనయుడు ఇషాన్.. ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గతంలో రామ్ చరణ్, పునీత్ రాజ్ కుమార్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన పూరీ… ఇషాన్ కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాడు.

rogue

 వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ చాన్నాళ్ల కిందటే కంప్లీట్ అయింది. అయితే కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేస్తానంటున్నాడు పూరి జగన్నాధ్. ఎమీరా డస్టర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను  తెలుగు-కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు.