రాక్ స్టార్ DSP బర్త్ డే స్పెషల్

Wednesday,August 02,2017 - 11:01 by Z_CLU

ఈ రోజు సౌత్ రాక్ స్టార్ దేవిశ్రీ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ‘దేవి’ సినిమాతో జర్నీ స్టార్ట్ చేసిన ఈ రాక్ స్టార్,  ఈ రోజు టాలీవుడ్ టాప్ మోస్ట్ పాప్యులర్ మ్యూజిక్ కంపోజర్.

ఆగష్టు 2, 1979 లో పుట్టిన దేవిశ్రీ ప్రసాద్ ఈ రోజు తన 38 వ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. తెలుగు సినిమాతో పాటు తమిళ, కన్నడ భాషలలోను సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతున్న DSP, జస్ట్ మ్యూజిక్ కంపోజర్ గానే కాదు, ఎనర్జిటిక్ రాక్ స్టార్ లా ఫ్యాన్స్ గుండెల్లో సెటిలైపోయాడు.

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్న DSP, మెస్మరైజింగ్ మ్యూజిక్ తో సక్సెస్ ఫుల్ గా, మరిన్ని హిట్స్ రీచ్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.