లిమిట్ దాటిపోయిన రోబో బడ్జెట్

Sunday,December 04,2016 - 02:16 by Z_CLU

భారతదేశంలోనే అతిభారీ చిత్రంగా ఏడాది కిందటే గుర్తింపు తెచ్చుకుంది 2.0 సినిమా. దాదాపు 250కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడీ రికార్డును మరోసారి ఇదే సినిమా అధిగమించింది. 250 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఈమధ్యే సవరించి 350కోట్ల రూపాయలకు మార్చారు. 2.0ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగాకూడా ఈ విషయాన్ని అనధికారికంగా తెలిపారు. తాజాగా ఈ బడ్జెట్ 400 కోట్ల రూపాయలకు చేరుకుందని తెలుస్తోంది.

హై-ఎండ్ గ్రాఫిక్స్ కోసం శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. అందుకే ఇప్పటికే ఉన్న గ్రాఫిక్స్ టీంతో పాటు మరికొందరు ప్రపంచ ప్రసిద్ధ గ్రాఫిక్ యానిమేటర్లను రంగంలోకి దింపాడు. వీళ్ల చేరికతో సినిమా బడ్జెట్ 4వందల కోట్ల రూపాయలకు చేరుకుంది. రజనీకాంత్. ఎమీజాక్షన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఏ ఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.