రోబో 2.0 ఆడియో ఈవెంట్ అప్ డేట్

Saturday,September 09,2017 - 01:11 by Z_CLU

మోస్ట్ అవేటెడ్ మూవీ రోబో 2.0 ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఈవెంట్ దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో అక్టోబర్ 27 న జరగనుంది. ఈ ఈవెంట్ లో A.R రెహమాన్ లైవ్ పర్ఫామెన్స్ హైలెట్ కానుంది.

భారీ ఎత్తున జరగనున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ శంకర్, అక్షయ్  కుమార్ తోపాటు మరికొంతమంది బిగ్గెస్ట్ స్టార్స్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు. ఆ వివరాలను త్వరలో అనౌన్స్ చేయనుంది సినిమా యూనిట్.

జనవరి 25, 2018 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా 15 భాషల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాలో రజినీకాంత్ సరసన ఎమీ జాక్షన్ హీరోయిన్ గా నటిస్తుంది.