3D ఫార్మాట్ లో రోబో 2.0 మేకింగ్ వీడియో

Friday,October 06,2017 - 11:28 by Z_CLU

సూపర్ స్టార్ రజినీకాంత్ రోబో 2.0. ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జనవరి 25, 2018 ని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకున్న ఈ మూవీ 3D ఫార్మాట్ లో రిలీజ్ కానుందనే విషయం తెలిసిందే. అయితే ఆల్ రెడీ ఈ సినిమాపై క్రియేట్ అయిన క్రేజ్ ని మైండ్ లో పెట్టుకుని లాంగ్ లాంగ్ బ్యాక్ ఈ సినిమా ప్రమోషన్స్ ని బిగిన్ చేసిన సినిమా యూనిట్, ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ వీడియోని 3D ఫార్మాట్ లో రేపు 6 గంటలకు రిలీజ్ చేయనుంది.

హాలీవుడ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ హై ఇంటెన్సివ్ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇప్పటికే ఫ్యాన్స్ లో కావాల్సినంత క్యూరాసిటీ జెనెరేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఇప్పుడీ వీడియో ఈ సినిమా పట్ల  మరింత క్రేజ్ క్రియేట్  చేయడం ఖాయం.  శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ హై బడ్జెట్ మూవీలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నెగెటివ్ రోల్ ప్లే చేయగా, ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.