టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న రోబో 2.0

Monday,March 06,2017 - 04:50 by Z_CLU

రోబో ఫాస్ట్ స్పీడ్ లో ఉంది. 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, చెన్నైలో 15 రోజుల రెగ్యులర్ షూటింగ్ తో టాకీపార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్ తరవాత ఏ మాత్రం బ్రేక్ తీసుకునే ఆలోచనలో లేని సినిమా యూనిట్ ఇమ్మీడియట్ గా బ్యాలన్స్ ఉన్న ఇంకో సాంగ్ ని తెరకెక్కించే ప్లానింగ్ లో పడింది. ఈ సాంగ్ కంప్లీట్ అయితే, మ్యాగ్జిమం షూటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అని తెలుస్తుంది.

అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకి A.R. రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న రోబో 2.0 రోజు రోజుకి భారీ ఎక్స్ పెక్టేషన్స్ నే క్రియేట్ చేసుకుంటుంది. ఈ సినిమాని మ్యాగ్జిమం దీపావళి కల్లా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.