12 కోట్ల వ్యయంతో రోబో 2.0 ఆడియో ఈవెంట్

Monday,October 09,2017 - 03:36 by Z_CLU

రజినీకాంత్ మోస్ట్ అవేటెడ్ మూవీ 2.0 ఆడియో ఈవెంట్ అక్టోబర్ 27 న జరగనుంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ హై ఎండ్ టెక్నికల్ ఎంటర్ టైనర్ రిలీజ్ ఈవెంట్ కి దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో అప్పుడే ప్రిపరేషన్స్ బిగిన్ అయిపోయాయి. ఈ ఈవెంట్ కి ఏకంగా 12 కోట్లు స్పెండ్ చేయనున్న సినిమా యూనిట్, ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ని రిచ్ అండ్ క్లాస్ గా ప్లాన్ చేస్తుంది.

దుబాయ్ లో ఆడియో ఈవెంట్ తరవాత హైదరాబాద్ లో టీజర్ రిలీజ్ చేయనున్న 2.0 టీమ్, చెన్నైలో ట్రైలర్ రిలీజ్ అంతే గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం హాలీవుడ్ స్టాండర్డ్స్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 25 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

A.R. రెహమాన్ మ్యూజిక్ క్మపోజ్ చేసిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించనున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త స్టాండర్డ్స్ ని క్రియేట్ చేయనున్న ఈ బిగ్గెస్ట్ మ్యాగ్నం ఓపస్ ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై తెరకెక్కుతుంది.