#RoarOfRRR - మేకింగ్ తో అదరగొట్టేశారు

Thursday,July 15,2021 - 12:14 by Z_CLU

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ RRR నుండి మేకింగ్ వీడియో రిలీజైంది. #RoarOfRRR పేరుతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తూ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొల్పుతుంది. మేకింగ్ వీడియోతో సినిమా ఎంత లావిష్ గా తెరకెక్కుతుందో విజువల్స్ ద్వారా చూపించాడు జక్కన్న. వీడియోలో వేల మంది టెక్నీషియన్స్ కష్టాన్ని చూపిస్తూ అలాగే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సన్నివేశాలతో కొన్ని స్పెషల్ షాట్స్ కూడా వేశారు.

ముందుగా సినిమా కోసం భారీగా వేసిన సెట్స్ చూపిస్తూ మేకింగ్ వీడియో స్టార్ట్ చేసిన రాజమౌళి ఆ తర్వాత సినిమా కోసం టెక్నీషియన్స్ పడిన శ్రమ చూపించారు. అలాగే సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న శ్రియ , సముద్రఖని తాలూకు మేకింగ్ షాట్స్ కూడా చూపించారు. మధ్య మధ్యలో కనిపించి కనిపించకుండా తారక్ , చరణ్ షాట్స్ చూపిస్తూ వాటిని ట్రైలర్ కోసం దాచినట్టుగా చెప్పకనే చెప్పాడు జక్కన్న. అలాగే సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించి మేకింగ్ చూపిస్తూ ఎట్రాక్ట్ చేసారు. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం తారక్ , చరణ్ చేసిన ప్రాక్టీస్ ని కూడా ఇందులో విజువల్స్ తో చూపించారు. చివర్లో ఎన్టీఆర్ , చరణ్ , అలియా భట్ , అజయ్ దేవగన్ షాట్స్ వేసి వీడియో ని క్లోజ్ చేశారు. ఆ షాట్స్ ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

RRR movie

ఓవరాల్ గా RoarOfRRR పేరుతో మేకింగ్ షాట్స్ ద్వారా విజువల్ ట్రీట్ అందించారు రాజమౌళి. ఇక ఎండింగ్ లో ఇటివలే ప్రకటించిన అక్టోబర్ 13 కే సినిమా రానుందని మరోసారి ఎనౌన్స్ చేశారు. దీంతో సినిమా దసరా కి వస్తుందా ? రాదా అనే అనుమానాలకు చెక్ పడింది. మరి మేకింగ్ వీడియోతో భారీ హంగామా క్రియేట్ చేసిన రాజమౌళి నెక్స్ట్ ట్రైలర్ తో ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసి ఆకట్టుకుంటారో చూడాలి. DVV ఎంటర్ టైన్మెంట్స్ బేనర్ పై DVV దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఆల్బం నుండి మొదటి సాంగ్ రిలీజ్ కానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics