రితిక సింగ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,April 11,2017 - 01:03 by Z_CLU

కిక్ బాక్సర్ రితిక సింగ్ గురు సినిమాతో తెలుగు వారి గుండెల్లో గూడు కట్టేసుకుంది. మరోవైపు లారెన్స్ సరసన ‘శివలింగ’ లో గ్లామరస్ క్యారెక్టర్ లో నటించి ఆల్ రౌండర్ గా ప్రూఫ్ చేసుకుంది. ఈ సందర్భంగా తన కరియర్ ప్లానింగ్స్ తో పాటు తన లైఫ్ లోని ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ని మీడియాతో షేర్ చేసుకుంది రితిక.

నో చెప్పలేక పోయా

బాక్సింగ్ చిన్నప్పుడే నేర్చుకున్నా. ఏషియన్ బాక్సింగ్ ట్రోఫీలో గెలిచాక ఓ సారి మాధవన్ నాన్నగారిని అప్రోచ్ అయి సాలా ఖడూస్ గురించి అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. సినిమాలంటే చాల యిష్టం కానే సినిమాల్లో నటిస్తానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. మ్యాడీ ప్రపోజల్ కి నో చెప్పలేకపోయా. ఆడిషన్ కి వెళ్లాను.. సెలెక్ట్ అయ్యాను… అంతా మారిపోయింది.

లారెన్స్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు

గురు సినిమా వేరు శివలింగ వేరు. గురు సినిమాలో అసలు మేకప్ లేకుండా అనటించాను. ఆ క్యారెక్టర్ కి అసలు మేకప్ అవసరం లేదు. కానీ ‘శివలింగ’ సినిమాలో మేకప్ వేసుకున్నా. అన్నింటికీ మించి డ్యాన్స్ చేశా. లైఫ్ లో ఫస్ట్ టైమ్. డ్యాన్స్ చేయాలి ఎక్స్ ప్రెషన్స్  చేయాలి, అందంగా కనిపించాలి… లారెన్స్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు… డ్యాన్స్ చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి లాంటి విషయాలపై చాలా కేర్ తీసుకున్నారు.

కష్టమే కానీ నచ్చేసింది

బాక్సింగ్ కన్నా యాక్టింగ్ చాలా కష్టం. మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ నేర్చుకున్నాను కాబట్టి పెద్దగా కష్టం అనిపించదు. కానీ యాక్టింగ్ వేరు… ప్రతి ఎక్స్ ప్రెషన్ పర్ ఫెక్ట్ గా ఇవ్వాలి. డ్యాన్స్ ప్రాక్తేస్ చేయాలి, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి. అయినా బాక్సింగ్ కన్నా యాక్టింగే బావుంది.

వెంకీ సినిమాతో ఇంట్రడ్యూస్ అవ్వడం అదృష్టం

సాలా ఖడూస్ చేస్తున్నప్పుడే యాక్టింగ్ కరియర్ ని సీరియస్ గా తీసుకున్నా. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ప్రూఫ్ చేసుకోవాలనే ఆలోచన అప్పుడే బిగిన్ అయింది. అంతలో తెలుగులో వెంకటేష్ గారితో సినిమా అంటే లక్కీగా ఫీల్ అయ్యా. అందునా ఆల్ రెడీ సాలా హదూస్ చేసిన క్యారెక్టరే కాబట్టి అంత సీనియర్ యాక్టర్ తో చేసేటప్పుడు నర్వస్ గా అనిపించలేదు.

ఇంపార్టెన్స్ ని బట్టి ఎంచుకుంటున్నా

ఆఫర్స్ అయితే చాలా వస్తున్నాయి. తమిళం లోను తెలుగులోను కథలు వింటున్నా. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితేనే ప్రిఫర్ చేస్తున్నా. లేకపోతే సింపుల్ గా నో చెప్పేస్తున్నా.

ఫేవరేట్ హీరోయిన్స్

ప్రియాంక చోప్రా, ఆలియా భట్, అనుష్క శర్మ. జస్ట్ పర్ఫామెన్స్ విషయంలోనే కాదు, వారి కరియర్ కోసం వాళ్ళు పడ్డ కష్టం, చిన్న వయసులోనే వాళ్ళు రీచ్ అయిన హైట్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది.