Kantara దర్శకుడిగా హ్యాట్రిక్ కొట్టిన రిషబ్ శెట్టి

Wednesday,October 19,2022 - 01:23 by Z_CLU

Rishab Shetty delivered Hat-trick hits as Director

ప్రస్తుతం తెలుగులో భారీ వసూళ్ళు అందుకుంటూ దూసుకెళ్తోంది ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్స్ సాదించాడు. రిషబ్ శెట్టి ‘రిక్కీ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. తర్వాత మళ్ళీ కొన్నేళ్ళకి రక్షిత్ శెట్టి నే హీరోగా పెట్టి కిర్రిక్ పార్టీ  అనే సినిమా డైరెక్ట్ చేశాడు రిషబ్. ఆ సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద వసూళ్ళు రాబట్టింది. ఆ సినిమాను తెలుగులో నిఖిల్ ‘కిరాక్ పార్టీ’ అనే టైటిల్ తో రీమేక్ చేశాడు కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు.

ఇక దర్శకుడిగా రిషబ్ శెట్టి రెండో హిట్ ‘స.హి.ప్ర.శాలే కసరగోడు, కొడుగే రమన్నా రాయ్’. ఈ సినిమాతో దర్శకుడిగా మరోసారి ప్రశంసలు దక్కించుకున్న రిషబ్ శెట్టి నాలుగేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంతార సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాతో కన్నడ పరిశ్రమలో మళ్ళీ భారీ వసూళ్ళు రాబట్టి ఈసారి తెలుగు , హిందీ , తమిళ్ ఆడియన్స్ ను కూడా తన రైటింగ్ , టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో హీరోగా నట విశ్వరూపం చూపించి ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో ఆడియన్స్ ను థియేటర్స్ నుండి పంపాడు. దర్శకుడిగా ఆ క్లైమాక్స్ డిజైనింగ్ ప్రేక్షకులను కట్టిపరేశేలా చేసింది.

కాంతార రెండ్రోజుల కలెక్షన్స్ 

ఏదేమైనా ‘కాంతార’ తో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్  దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్ సాదించి తన సత్తా చాటుకున్నాడు. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకొని అవలీలగా 100 కోట్ల (గ్రాస్ ) దాటేశాడు.

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics