సరైన సమయం.... సరైనోడుతో....

Saturday,November 12,2016 - 02:00 by Z_CLU

టాలీవుడ్ లో ఓ రెండు సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు అందుకున్న పూజ హెగ్డే ఆ రెండు సినిమాలతో బాలీవుడ్ లో బంపర్ అఫర్ అందుకుంది.  హృతిక్ రోషన్ సరసన ‘మొహెంజొదారో’ సినిమాతో బాలీవుడ్ లో  ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గమ్మ కి ఆ సినిమా ఆశించిన ఫలితం అందించలేదు.

బాలీవుడ్ లో భారీ అఫర్ అందుకోవడంతో టాలీవుడ్ ఆఫర్స్ ను వదులుకున్న పూజ… అక్కడ  ఆఫర్స్ లేకపోవడం తో మళ్ళీ టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అటు బాలీవుడ్ లోనూ , ఇటు టాలీవుడ్ లోనూ ఆఫర్స్ లేని టైం లో ఈ ముంబై ముద్దుగుమ్మ కి సరైనోడు తగిలాడు. ప్రస్తుతం  టాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన పూజ కి  డీజే సినిమాతో హీరోయిన్ గా  బంపర్ అఫర్ ఇచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరి ఈ సినిమాతో పూజ మళ్ళీ టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటుందో? లేదో చూడాలి…